అంకమ్మ చెరువుకు తక్షణ మరమ్మతులు చేపడతాం: మంత్రి తుమ్మల
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల.. పెద్దవాగు ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో మరోసారి సమావేశం పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: మురసు తుఫాన్ కారణంగా తెగిపోయిన అశ్వారావుపేట సమీపంలోని అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం వేకువజామున స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండి పడటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తెగిపోయిన చెరువుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, తిరిగి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను...