అంకాళమ్మ వారికి విశేష పూజలు
నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 6 ( పొలిటికల్ పవర్ న్యూస్ న్యూస్) లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామదేవత అయిన శ్రీ అంకాళమ్మవారికి అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతీ శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మవారికి దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా శ్రీఅంకాళమ్మవారికి అభిషేకం, విశేషఅర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది. ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని...