పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు29.2026.అక్క తమ్ముళ్ల అనుబంధం జన్మజన్మల సంబంధమంటూ అక్క తమ్ముళ్ల కు రాఖీ కడుతూకాపాడుకోసాగారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా వనపర్తి జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో అన్నయ్యలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు అక్కలు రాఖీలు కడుతూ వారి ఆశీర్వాదాలు తీసుకొని రాఖీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. రాఖీపండుగ సందర్భంగాజిల్లాలో,మండలాలలో,గ్రామాలలోప్రశాంత వరణం నిలుకొని వివిధ పట్టణాలలో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు అందరు కూడా గ్రామాలకు చేరుకుని వారి అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడంతో ఒక పండుగ వాతావరణంలో మారిపోయింది. ఇతర రాష్ట్రాలలో, పట్టణాలలో ఉన్న చెల్లెళ్లు వారి వారి అన్నయ్యలకు రాఖీలు పంపి రాఖీలు కట్టుకోమని ఆశీర్వదించమనికోరారు.కొత్తకోటమండలకేంద్రంలోని మహానంద మల్కిదాస్ ఆచల గురు ఆశ్రమం లో రాఖీపండుగసందర్భంగాఅన్నాలకుచెల్లెళ్లు,తమ్ముళ్లకు అక్కయ్యలు రాఖీలు కట్టి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే యస్.తేజస్విని, యం. వైష్ణవి, తమ్ముళ్లు టి.గ్రీత్ వీక్,జున్నులకు,అనంతరంటి.తిరుపతమ్మ,యస్.వెంకటేశ్వరమ్మ,సౌభాగ్యలక్ష్మి,శంకరమ్మలుఅన్నడి.ఈశ్వర్,తమ్ముళ్లు డి.శివశంకర్, డి.శివరాం లకు రాఖీ కట్టి మంగళహారతులు ఇచ్చి, స్వీట్ తినిపిస్తూఆనందంతో రాఖీపౌర్ణమివేడుకలనుఘనంగానిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో డి. భవ్యశ్రీ,యస్.ఈశ్వర్,యం. లక్మన్న తదితరులు పాల్గొన్నారు.


