POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 7:28 pm Posted by : POLITICAL POWER

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,

– కొత్తకోట ఎస్సైలు విక్రమ్,భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదినపత్రికపిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.13.2026.వచ్చే నెల 07వతేదీనసంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల పోరం 11 వ రాష్ట్ర మహాసభనువిజయవంతంచెయాలనీదళితజర్నలిస్టులపోరంవ్యవస్థాపకులుకాశపోగుజాన్,పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సై విక్రమ్, సెకండ్ ఎస్సై భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా వ్యవస్థాపకులు కాశపోగు జాన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్టంలో దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ గురించిమేముపోరాడుతున్నామనితెలిపారు.అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడెషన్ కార్డులు మంజూరు చేయాలి, దళిత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులుమంజూరుచేసితక్షణమేఅమల్లోకితీసుకురావాలని కోరారు. దళిత జర్నలిస్టులకు అభయ హస్తం పథకం కింద సబ్సిడీ రుణాలు మంజురు చెయాలనీ డిమాండ్ చేశారు. అక్రిడెషన్ కమిటీలో దళిత జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలలో జరిగే మహాసభకు దళిత జర్నలిస్టుల సోదరులుపెద్దఎత్తులహాజరుకావాలనిపిలుపునిచ్చారు. ముందుగా ఎస్సై విక్రమ్ కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి ధనుష్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, దళిత జర్నలిస్టుల పోరం లీగల్ అడ్వైజర్ మునగారి కృష్ణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు మిషేక్, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు మేస్త్రి శ్రీను, దళిత జర్నలిస్టు ఫోరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్, దిశ రమేష్, బాలరాజు, లక్ష్మణ్, దాసు తదితరులు ఉన్నారు.