అక్రమ టేకు కలపపై టాస్క్‌ఫోర్స్ కొరడా..అంకంపాలెం బీట్‌లో రూ.7.05 లక్షల విలువైన కలప స్వాధీనం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 23:అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికివేయడం, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కలపను నిల్వ చేయడం, కొనుగోలు చేయడం, రవాణా చేయడంపై అటవీ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా అందిన సమాచారంతో దమ్మపేట అటవీ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా అక్రమంగా నిల్వ చేసిన టేకు కలపను స్వాధీనం చేసుకుంది. దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అంకంపాలెం బీట్‌లో అనుమతి పత్రాలు లేకుండా...