పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.నిమజ్జనాన్ని పురస్కరించుకుని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి పలు గణపతి విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదటగా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన మహాగణపతిని దర్శించుకున్న అఖిలపక్ష బృందానికి నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అక్కడ పూజ అనంతరం హనుమాన్ టేకిడి, సాయినగర్ కాలనీ, జింగిడిపురం తదితర ప్రాంతాల్లోని గణపతి విగ్రహాలను దర్శించుకుని పూజలు చేసి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చర్ల చందర్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్కుమార్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు కొత్తగొల్ల శంకర్, బీజేపీ నాయకులు రవి, రామస్వామి, సాయికుమార్, శివకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


