POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:42 pm Posted by : POLITICAL POWER

అడవి దుప్పిని చంపి, మాంసం విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులకు పట్టుబడ్డారు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ జూన్ 17 2026: మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం మాజీ మండల అధ్యక్షుని బావ,మరియు పల్లం గూడ సర్పంచ్ సోదరుడు మరికొంత మంది కలిసి అడవిలో వన్యప్రాణులను వేటాడి అడవి దుప్పిని చంపి,మాంసం విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులకు పట్టుబడ్డారని సమాచారం.కానీ కాంగ్రెస్ నాయకుల అధికార బలంతో ఇట్టి విషయాన్ని బయటికి పొక్కకుండ ఫారెస్ట్ అధికారులపై మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఒత్తిడి తెచ్చి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా చూస్తున్నారని కాసిపేట మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఒత్తిడికి తలొగ్గి ఫారెస్ట్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తారా లేదా మరుగున పడవేస్తారా కాసిపేట ప్రజలు వేచి చూడాలి.