అధికారుల అడ్డగోలు నిర్ణయాలు.. పంచాయతీలో పెరిగిన అవినీతి భారం! – పనిభారంతో ఎంపీడబ్ల్యూల సమ్మె.. కల్వర్టు మోరీలు వేయకుండానే బిల్లుల స్వాహా? – టేకులపల్లి మండలం శంభునిగూడెం పంచాయతీలో దారుణ పరిస్థితి

    టేకులపల్లి, పొలిటికల్ పవర్ (పిఎన్9 న్యూస్ - ప్రతినిధి సత్యప్రసాద్, నవంబర్ 02): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీలో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల (MPW)పై పరిమితికి మించిన అధిక భారం మోపడంతో వారు తట్టుకోలేక గత రెండు నెలలుగా విధులను బహిష్కరిస్తూ విధులకు దూరంగా (బంద్ పాటిస్తూ) ఉన్నారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి అధికారులు చేతులెత్తేసి అడ్డగోలు ప్రత్యామ్నాయ చర్యలకు దిగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....