POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 5:52 pm Posted by : POLITICAL POWER

అధిక వడ్డీలకు ప్రజలకు అప్పులు ఇస్తూ వారిని మానసికంగా హింసిస్తున్న ముఠాని చాకచక్యంగా పట్టుకున్న ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ స్టేషన్ అధికారులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 21 2026: తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు వచ్చి అరాచకాలు చేస్తున్నారని తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అక్రమ సంపాదన అలవాటు పడి స్థానిక ప్రజలను మోసపూరిత మాటలతో మోసాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ తన సిబ్బందితో నగరంలోని వాసిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న గల్లీ బజార్లోనే ఒక గదిలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామం అనపర్తి మండలానికి చెందిన కలెక్షన్ ఏజెంట్ అయిన కర్రీ మణికంఠ రెడ్డి 31 సంవత్సరాలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి నట్లు టౌన్ ఏసిపి రమణమూర్తి తెలిపారు ఈ కేసులో పరారీలో ఉన్న కర్రి బామిరెడ్డి సత్తి వంశీకృష్ణ రెడ్డి అనే వ్యక్తులు మోసాలకు పాల్పడే పాల్పడి కీలక నిందితుడు సబ్బల్ల సత్యనారాయణ రెడ్డి వద్ద కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఖమ్మంలోని కాలవడ్డు పాండురంగాపురం వెలుగుమట్ల పంపిణీల రోడ్డు వైయస్సార్ కాలనీ రామన్నపేటలోని నిరుపేదలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా డబ్బులు అధిక వడ్డీలకు అప్పులకు అప్పులుగా ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు నిందితుడు నుండి భూమారెడ్డి పేరుతో ఉన్న అకౌంట్ బుక్కు డైలీ కలెక్షన్ బుక్కు కలెక్షన్ రిజిస్టర్లు కస్టమర్ పేర్లతో ఉన్న రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ప్రజలు ఇలాంటి మోసపూరిత వారి మాటలు నమ్మి అవసరాల కోసం అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని మోసపోవద్దని ప్రజలకు పోలీసు వారు తెలియజేశారు.