పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన కాటారం చెన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ జూలై 27, 2026న కన్నుమూశారు. ఈ విషయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ మంగళవారం చెన్నమ్మ నివాసానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… చెన్నమ్మ కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాల కోసం తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోజెర్ల గ్రామ 1వ వార్డు సభ్యుడు రాములు, 2వ వార్డు సభ్యుడు సింగం కృష్ణ, సింగం నరసింహ, కావలి కురుమయ్య, భూపని ఆంజనేయులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొని చెన్నమ్మకు నివాళులు అర్పించారు.