అనంతపురం అభివృద్ధ్యే లక్ష్యం.. అవినీతి, వివాదాలకు దూరంగా ఉండండి: వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం! – పదవులు అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే అవకాశం! – ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగర రూపురేఖలు మార్చాలి – కార్పొరేషన్ విజయంపై వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
పొలిటికల్ పవర్ న్యూస్ 9 / అనంతపురం జిల్లా కర్నూలు ప్రతినిధి అంపయ్య ఎం (నవంబర్ 06, 2026): అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో లభించిన ప్రజా విజయాన్ని పురస్కరించుకుని, నగరాభివృద్ధే ఏకైక లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన మేయర్ రమేష్ గౌడ్, కార్పొరేటర్లు, ఓటమి చెందిన అభ్యర్థులు మరియు స్థానిక నాయకులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు దివంగత...