156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేత
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్,ఎం. నాగార్జున, అశ్వారావుపేట, నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 156 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టారు
ఈ మేరకు బాధితులకు సంబంధించిన వైద్య ఖర్చుల బిల్లులను హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి విభాగం అధికారులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
