పొలిటికల్ పవర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో రాంప్రసాద్
నగరంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు, అకాడమీల ఎదుట భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయనను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, అరెస్టులతో తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరుపై ఆందోళన కలుగుతున్నదని అన్నారు. అనుమతిలేని విద్యాసాంస్థలను ప్రోత్సహస్తున్నదా అని ప్రశ్నించారు. కరీంనగర్ నగరంలో అనుమతి లేని ‘రెజోనెన్స్ అకాడమీ’ ప్రచార కార్యక్రమానికి వస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణను అడ్డుకుంటామని చెబితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అకాడమీలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.
జేడీ లక్ష్మీనారాయణకు విజ్ఞప్తి: “మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కరీంనగర్‌లోని ఎలైట్ హోటల్‌లో అనుమతి లేని రెజోనెన్స్ అకాడమీకి సంబంధించి IIT-JEE, NEET ఫౌండేషన్ పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఆయన రావడం సరికాదు. దీన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని శేఖర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును, తల్లిదండ్రుల అవసరాలను విద్యాసంస్థలు వ్యాపార అవకాశంగా మార్చుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
నిబంధనల ఉల్లంఘన: అకాడమీల పేరుతో పగటిపూట కూడా కళాశాలలు నడపడం నిబంధనలకు విరుద్ధమని, నిబంధనల ప్రకారం అకాడమీలు కేవలం సాయంత్రం వేళల్లో మాత్రమే నిర్వహించుకోవాలని ఆయన గుర్తుచేశారు.
చట్టవిరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకం తరపున ఆందోళనలను ఉధృతం చేస్తామని బండారి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారూ

