అనుమతి లేని విద్యాసంస్థలను అడ్డుకుంటాం:* – AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముందస్తు అరెస్ట్
పొలిటికల్ పవర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో రాంప్రసాద్ [gallery ids="9902,9903"] నగరంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు, అకాడమీల ఎదుట భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ హెచ్చరించారు. గురువారం ఆయనను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, అరెస్టులతో తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ఆందోళన కలుగుతున్నదని...