రాఖీ పౌర్ణమి వేళ అభిమానాన్ని చాటిన బీఆర్‌ఎస్ మహిళలు
పొలిటికల్ పవర్, ఆగస్టు 28: అశ్వారావుపేట : రాఖీ పౌర్ణమి సందర్భంగా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ మహిళల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు అండగా నిలిచే నాయకుడిగా కేటీఆర్‌ను భావిస్తూ రాఖీ కట్టినట్లు మహిళలు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా మహిళలు కొనియాడారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, భవిష్యత్తులోనూ ఆయనకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.
అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్, భూక్య ప్రసాద్ , జుజ్జురపు శ్రీరామ్‌మూర్తి, సత్యవరపు సంపూర్ణ, తగరం జగన్నాథం, మోటూరి మోహన్, ఆరెపల్లి గోవిందం తదితరులకు బీఆర్‌ఎస్ మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు కేటీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ రాఖీ పౌర్ణమి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా నాయకులు కాసాని పద్మ, భూక్య ఉదయజ్యోతి, సాధు జోస్నాబాయితో పాటు పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.