POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 8:13 am Posted by : POLITICAL POWER

అన్నాచెల్లెళ్లుఅక్కాతమ్ముళ్లమధ్యనప్రేమానురాగాలే రక్షా బంధన్

పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 28.ఆగస్టు2026.రాఖీఅనేదిసోదరితనసోదరుడికి కట్టే ఒక పవిత్రమైన దారం. ఇది వారి మధ్య ఉన్నప్రేమ,రక్షణఅనుబంధాన్నిసూచిస్తుంది. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాలనుండిరక్షిస్తానని వాగ్దానంచేస్తాడు.రాఖీపండుగనుఎంతోఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.రాఖీ పండగ ఎప్పుడు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నెల ఆగస్టు పూర్ణమితిధిఆగస్టు27నఉదయం9గంటలకుప్రారంభమై,ఆగస్టు28నఉదయం9.48గంటలకుముగుస్తుంది.శుభ సమయం. మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.0 గంటల వరకు అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీకట్టవచ్చు.ఉదయతిథిప్రకారంరాఖీపడుగఆగస్టు28నజరుపుకోవాలి.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికిప్రతీకగారాఖీపౌర్ణమనిజరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉన్నందున ఈరోజే ఈ పండగ జరుపుకుంటారు. రాఖీకట్టేటప్పుడుసోదరుడినితూర్పులేదాఉత్తరంవైపు కూర్చోబెట్టి నుదుట కుంకుమ పెట్టి, హారతి ఇవ్వాలి.ఆతర్వాత రక్షాబంధనం కట్టి స్వీటు తినిపించాలి. సోదరి ప్రేమకు గుర్తుగా కానుకలు ఇచ్చి ఎల్లప్పుడూరక్షగాఉంటాననిసోదరుడువాగ్దానంచేయాలి.పురాణాల్లోద్రౌపది తన చీర కొంగును శ్రీకృష్ణుడి గాయపడిన వేలికి కట్టిందని, దానితో ఆమెకు రక్షగా నిలిచింది. అప్పటినుంచి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. రాఖీ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఆరోజునుసోదరి,సోదరుడిమధ్యపవిత్రసంబంధానికిచిహ్నంగాభావిస్తారు.సోదరితనసోదరుడిమణికట్టుకు రాఖీ కట్టి అతని దీర్ఘాయుష్షు, ఆనందాన్నికోరుకుంటుంది.సోదరుడుతనజీవితాంతం ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే రాఖీనిసోదరుడికిమాత్రమేకట్టవచ్చామరికేవరికైనా కట్టవచ్చా ఈ రోజుతెలుసుకుందాం. సోదరుడు, సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ రాఖీ పండుగ.