అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె శ్రీకారం!

మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.. ఇంకుడు గుంతల పనులకు భూమిపూజ నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి పంచాయతీ కార్మికులతో కలిసి భోజనం చేసి వారి కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, అశ్వారావుపేట / దమ్మపేట: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు....