POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 11:01 pm Posted by : POLITICAL POWER

అభివృద్ధి సంక్షేమం మా ధ్యేయం. ఇంటింటికి ప్రచారంలో కూటమినాయకులు 

పొలిటికల్ పవర్: దాచేపల్లి నగర పంచాయతీలోని గ్రామాలపాడు గ్రామంలో గురజాల శాసనసభ్యులు యరపతినేనిశ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరుస్తూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని వివరిస్తూ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఒక కూటమి ప్రభుత్వం లోనే సాధ్యపడిందని గతంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గురజాల శాసనసభ్యులు యరపతినేనిశ్రీనివాసరావు రాగానే గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర్ శెట్టి జానకి రామయ్య ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వంచేస్తున్న సంక్షేమ ను అభివృద్ధిని తెలియపరచడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ హిట్ కార్యక్రమాలను గుర్తుచేస్తూ తల్లికి వందనం ఉచిత గ్యాస్ మహిళలకు ఫ్రీ బస్ రైతు భరోసా విద్యా కానుక ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేయటంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూటమినాయకులు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమిప్రభుత్వం జెండా రెపరెపల ఎగిరే విధంగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరు స్థానిక ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకొని మరల కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఈ సందర్భంగా కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ ఇంచార్జి సుంకర శీను గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర శెట్టి జానకిరామయ్య టిడిపి సీనియర్ నాయకులు శంకరశెట్టి సుబ్బారావు శంకర్ శెట్టి రాము బండి కాంతారావు తోట వెంకటేశ్వర్లుబత్తుల పూర్ణచంద్రరావుప్రభుదాసు రోళ్ళశేషయ్య మంచి రామరాజు బత్తులనాగేశ్వరరావు ఉదయ్ పి మరియదాసు కూటమినాయకులు తదితరులు పాల్గొన్నారు.