POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:12 pm Posted by : POLITICAL POWER

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 09 2026: తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు దిశా కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ జిల్లా కలెక్టర్ అంకిత్ దమ్మపేట అశ్వారావుపేట మండలాల్లో విస్తృత పర్యటన నిర్వహించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆదివాసీ కొండరెడ్డి గిరిజన గ్రామాలైన పూసుగూడెం, కట్కూరులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు అనంతరం పట్వారిగూడెం నుండి పాకలగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి స్థానిక రైతు వేదికలో రాచూరుపల్లి, మల్లారం గ్రామాలకు చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు అలాగే పట్వారిగూడెంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. (నాయుడుపేట) మొద్దులగూడెం గ్రామంలో రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రెడ్యాలపాడు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మొద్దులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి కొమరం భీం అర్బన్ ఎకో పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించారు అలాగే కొత్తమామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ రమేష్ జిల్లా మండల స్థాయి ఉన్నతాధికారులు జిల్లా మండల స్థాయి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు.