అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదాం. అమరుల త్యాగాల స్పూర్తితో విభజన హామీల సాధన కోసం పోరాడదాం. – డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.
బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎమ్ వెంకటేశ్వర్లు కడప జిల్లా అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదామని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. డివైఎఫ్ఐ46 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహం దగ్గర డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని ఆవిష్కరణ చేశారు. నాలుగు రోడ్ల దగ్గర ఉన్న డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు...