పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ జూన్ 24 2026: యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీ మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలని అమెరికా DHS ప్రతిపాదించింది. వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం, చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులపై ఈ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. USCIS విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం, సాధారణ పేపర్ ఫైలింగ్ (Form N-400) ఫీజు ప్రస్తుతం ఉన్న $760 నుంచి $1,330 (రూ.64,000 నుంచి రూ.1,13,050)కు పెరగనుంది. అదేవిధంగా, ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు $710 నుంచి $1,280 (రూ.59,000 నుంచి రూ.1,09,000)కు చేరనుంది. వీటితో పాటు, పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణపై అప్పీల్ చేసేందుకు ఉపయోగించే Form N-336 ఫీజును $830 నుంచి $1,475కు పెంచాలని ప్రతిపాదించారు. ఇది దాదాపు 77 శాతం పెరుగుదల.