POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:14 am Posted by : POLITICAL POWER

అర్ధ శతాబ్దపు ఆధ్యాత్మిక వైభవానికి చిన్న జీయర్ స్వామి

వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి స్వర్ణోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించిన ఆలయ ధర్మకర్త రఘునాథచార్యులు, శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి లు 

సానుకూలంగా స్పందించిన చిన్న జీయర్ స్వామిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: వచ్చే ఏడాది మార్చి 10, 11, 12 తేదీల్లో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలకు హాజరవుతానన్నా చిన్నజీయర్ స్వామి వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహోత్సవాలకు చిన్న జీయర్ స్వామివారు హాజరుకానున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలకు హాజరుకావాలని ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలిసి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన చిన్న జీయర్ స్వామి సానుకూలంగా స్పందించి, మార్చి 10, 11, 12 తేదీల్లో వనపర్తికి విచ్చేస్తామని హామీ ఇచ్చారు. 5 దశాబ్దాల ఆలయ ఆధ్యాత్మిక ప్రస్థానానికి గుర్తుగా జరిగే స్వర్ణోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఆహ్వానానికి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగ సతీమణి శారదా రెడ్డి, కుమారుడు నవనీత్ రెడ్డి లతో వెళ్లి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఎస్ఎల్ఎన్ రమేష్, తిరుమల మహేష్, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.