అర్హులకు మొండిచెయ్యి.. అనర్హులకు పెద్దపీట – జీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం ఆరోపణ
పొలిటికల్ పవర్,మణుగూరు, సెప్టెంబర్ 9: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులైన పేదలకు మొండిచేయి చూపుతూ అనర్హులకు పెద్దపీట వేస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ (GSP) రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని లబ్ధిదారులను ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామానికి చెందిన తాటిగౌరీ.. భర్త, ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో దయనీయంగా జీవనం సాగిస్తున్నారని, అలాంటి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు...