POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:39 pm Posted by : POLITICAL POWER

అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు 

బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం

మేడిపల్లి: 04 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా దుకాణ యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మొత్తం 45 మంది బాణసంచా దుకాణ యజమానులు హాజరయ్యారు. సమావేశంలో, వారికి అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కల్పించే జాగ్రత్తలు మరియు తప్పనిసరి భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించడం జరిగింది. వ్యాపారం ప్రారంభించే ముందు అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖ నుండి ముందస్తు అనుమతులు పొందాలని వారికి సూచించడం జరిగింది. అంతేకాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి, వారి వారి ప్రాంగణాలలో తగినంత నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక యంత్రాలు మరియు ఇతర అవసరమైన అగ్ని భద్రతా పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని వారికి సలహా ఇవ్వడం జరిగింది. సూచించిన అన్ని భద్రతా మార్గదర్శకాలను మరియు ముందుజాగ్రత్త చర్యలను ఖచ్చితంగా పాటించాలని కూడా వారికి సూచించడం జరిగింది.