POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:52 pm Posted by : POLITICAL POWER

అల్వాల గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు కార్యక్రమం – ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 11 2026: భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం అల్వాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓటర్ల నమోదు, ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ జి. సుదర్శన్ రెడ్డి, బీఎల్‌ఓ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి శోభారాణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొండారెడ్డి, బుక్ కీపర్ కుప్పిరెడ్డి మాధవి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఫారాలు నింపించడంతో పాటు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. అల్వాల గ్రామ ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 1,040 మంది ఓటర్లు ఉండగా, వారిలో సుమారు కొంత మంది మరణించిన, కొందరు పెళ్లిళ్లు చేసుకొని లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. మిగిలిన 1,000 మంది అర్హులైన ఓటర్లలో ఇప్పటివరకు 450 మంది ఆన్‌లైన్ ద్వారా, 150 మంది ప్రత్యక్షంగా ఫారాలు నింపడంతో, మొత్తం 600 ఫారాలు బీఎల్‌ఓకు తిరిగి అందాయి. మరో రెండు రోజుల్లో మిగిలిన 400 మంది ఓటర్ల ఫారాలను పూర్తి చేయాల్సి ఉన్నందున, గ్రామ ప్రజలందరూ తమకు అందిన ఎస్‌ఐఆర్ ఫారాలను ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువచ్చి సక్రమంగా నింపించుకుని వెంటనే బీఎల్‌ఓకు అందజేయాలని బీఎల్‌ఓ జి. సుదర్శన్ రెడ్డి గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.