వనపర్తిలో మీ గెలుపు కల.. 2028లోనూ ఓటమి తప్పదు!
ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్!
హరీష్‌రావుకు మతిభ్రమించిందా? సిద్దిపేటలో పంటలు ఎండలేదా?
మంగంపల్లిలో దళితుడి ఇంట్లో నిరంజన్‌రెడ్డి మంచినీళ్లు ఎందుకు తాగలేదు?
మాజీ మంత్రులపై విరుచుకుపడ్డ పెద్దమందడి కాంగ్రెస్ నేతలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 3 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘రైతన్నల రణభేరి’ సభ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఓదార్పు సభగా మారిందని పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. మంగళవారం అల్వాల గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖిల్లా ఘనపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ టి. రఘుప్రసాద్, వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణారెడ్డి మాట్లాడారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డి గెలుపు కేవలం కల మాత్రమేనని, 2028 ఎన్నికల్లోనూ ఆయనకు ఓటమి తప్పదని కాంగ్రెస్ నేతలు జోస్యం చెప్పారు. కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన నిరంజన్‌రెడ్డిని వనపర్తి ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని విమర్శించారు.
ఎమ్మెల్యే మేఘారెడ్డిని లక్ష్యంగా చేసుకునేందుకే సభ!
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా అల్వాలలో ఎండిపోయిన పంటలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై విమర్శలు గుప్పించేందుకే అల్వాల సభను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రైతులను ప్రభావితం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ప్రాంతంలో పంటలు ఎండిపోలేదా? అని ప్రశ్నించారు. గతంలో రైతులను వరి సాగు చేయవద్దని సూచించింది బీఆర్ఎస్ నాయకులేనని ధ్వజమెత్తారు. హరీష్‌రావు ముందుగా తన కుటుంబ సభ్యురాలు కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాలని హితవు పలికారు.
దళితుల పట్ల నిరంజన్‌రెడ్డికి ఉన్న గౌరవం ఇదేనా?
మంగంపల్లిలో దళిత యువకుడు సుధీర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్‌రావు ఆయన ఇంట్లో మంచినీళ్లు తాగగా, నిరంజన్‌రెడ్డి ఎందుకు తాగలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దళితుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, బీఆర్ఎస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరంజన్రెడ్డిలా ఫామ్‌హౌస్‌లలో విలాసవంతమైన జీవితం గడపడం మేఘారెడ్డి లక్ష్యం కాదని, పేద ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలుస్తున్న నాయకుడని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సర్పంచులు సూర్య గంగమ్మ, రవి, మంజుల, శ్రీశైలం యాదవ్, రాములు యాదవ్, చంద్రశేఖర్, గోపాల్ నాయక్, రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవిసాగర్, నాయకులు గట్టు యాదవ్, కొండ రవీందర్‌రెడ్డి, శివ యాదవ్, బాబు రెడ్డి, డీలర్ శ్రీనివాసులు, చంద్రశేఖర్‌రెడ్డి, అమ్మపల్లి బాలు, గట్ల ఖానాపూర్ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.