అశ్వారావుపేటలో శివమాల ధారణ
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కోనేరు బజార్లోని పురాతన కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సుమారు 30 మంది శివభక్తులు శివమాల ధారణ చేశారు. 41 రోజుల మండల దీక్ష అనంతరం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో ఉన్న 12వ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఘృష్ణేశ్వర స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించనున్నారు. కాశీ, రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొక్కులు ఉన్న కొందరు భక్తులు ఆయా క్షేత్రాల్లోనూ ఇరుముడి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, శివుని అనుగ్రహంతో...