POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 8:46 pm Posted by : POLITICAL POWER

అశ్వారావుపేట నియోజకవర్గంలో నేడు మంత్రుల పర్యటన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ప్రతినిధి జూన్ 08 2026: అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం (జూన్ 9) పర్యటించనున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు పట్వారిగూడెంలో పట్వారిగూడెం–పాకలగూడెం బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదే గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, రాచురుపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు మొద్దులగూడెంలో మొద్దులగూడెం–రెడ్డ్యాలపాడు బీటీ రహదారికి శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.20 గంటలకు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ అర్బన్ పార్క్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు మండల అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరుకావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.