అశ్వారావుపేట నియోజకవర్గంలో 18,322 మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు
రూ.3.66 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అశ్వారావుపేట,పొలిటికల్ పవర్ అక్టోబర్ 30:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడతలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని 18,322 మంది రైతుల ఖాతాల్లో రూ.3,66,44,000 జమయ్యాయని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మండలాల వారీగా అశ్వారావుపేటలో 5,246 మంది రైతులకు రూ.104.92 లక్షలు, దమ్మపేటలో 5,238 మందికి రూ.104.76 లక్షలు, ములకలపల్లిలో 3,832 మందికి రూ.76.64 లక్షలు,...