POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:27 am Posted by : POLITICAL POWER

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఆయుధపూజతో ఖాకి పవర్ కి మరింత పదును!

ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం 

ఖాకికీ గౌరవం ఆయుధాలకు పూజ!

ప్రజల రక్షణే లక్ష్యం… శాంతి భద్రతలే ద్వేయం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 21 2026: ఖాకీ యూనిఫామ్‌కు సంప్రదాయం తోడైంది.. ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే అశ్వారావుపేట పోలీసులు ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐ బి. సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, ప్రజల భద్రత కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని సిబ్బంది సంకల్పించారు .ఆయుధ పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మరింత క్రమశిక్షణ, అంకితభావం, అప్రమత్తతతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు ఎలాంటి భయం లేకుండా భద్రతా వాతావరణం కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటం, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.