పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆర్సి కారం వెంకటేష్: మూకమామిడి పంచాయతీ పరిధిలో మొగరాలగుప్ప గ్రామములో ఉమ్మడి ములకలపల్లి పంచాయితీ ఉన్నప్పుడు 2015-16 సంవత్సరములలో పోసిన సిసి రోడ్డు గత 8 ఎనిమిది సంవత్సరాల నుండి సీసీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు కుంగిపోయి ప్రజలు ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు కూడా రోడ్డుపైనే నిల్వ ఉండి దుర్వాసన వచ్చేది అని ఎండాకాలం కూడా నీళ్లు ఎటు పోకుండా అక్కడే నిల్వ ఉండేది. ఈ విషయాన్ని వార్డు సభ్యులకు తెలియపరిచారు. వార్డు సభ్యులు పాలకవర్గం దృష్టికి తీసుకురాగా సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్ళమని సీసీ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ ఏర్పాటు త్వరలో చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని తెలియపరిచారు. కొందరు పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులు కార్యక్రమాలు ఓర్వలేక ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి కావాలని పత్రిక విలేకరులను తప్పు దోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చి వార్త రాయిస్తున్నారు.ఇది అవాస్తవం దయచేసి పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు. సహకరించాలి. అవార్డు ప్రజలు వార్డు సభ్యురాలిని తనం పావని కోరగా అప్పటివరకు మురుగునీరు నిల్వ ఉండకుండా తాత్కాలికంగా మట్టి పోయించమని వార్డు సభ్యుని కోరారు.అందువల్ల గ్రామంలో గ్రామస్తులు ఇళ్లకు మట్టి పోయిస్తున్న క్రమంలో పోయించడం జరిగింది.బాగున్న సిసి రోడ్డుమీద ఎవరు మట్టి పోయారు.సమస్య ఉంటేనే దానికి ఏదైనా మార్గం చూస్తారు.కొత్తగా పోసిన గ్రావెల్ మట్టి వల్ల వర్షం చినుకులకు నీరు చేరింది.విషయాన్ని మీడియా మిత్రులు కూడా ప్రచూరించేటప్పుడు గమనించాలి.అక్కడ ఎలాంటి ఏ విధమైన సీసీ రోడ్డును పాడు చేయలేదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులను చూడలేక కొందరు కావాలని పాలకవర్గం మీద బురద చల్లుతూ,అసత్య ప్రచారాలు చేస్తున్నారు.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి తెలిపారు.పంచాయతీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో ఇంకా అభివృద్ధి చేయవలసిన పనులు చాలా ఉన్నాయని,పంచాయతీ లో నిధులు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నామని.పంచాయితీకి నిధులు ప్రభుత్వం విడుదల చేసినప్పుడు మిగతా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.