POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 6:30 pm Posted by : POLITICAL POWER

అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.

హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: సాహిత్య పోషకులుగా నిరంజన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. గుర్రం జాషువా 131 జయంతిని ఈనెల 28న ఘనంగా నిర్వహించడంతో పాటు 29వ తేదీన సాయంత్రం 4.00గంటలకు ఎం.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు గుర్రం.జాషువా సాహితీ సదస్సు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాబట్టి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. నిరంజన్ రెడ్డి స్వగృహంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశములో పలుస.శంకర్ గౌడ్, డాక్టర్ వీరయ్య, నారాయణ రెడ్డి, ఎం రాజశేఖర్ మాట్లాడుతూ… సమాజములో అస్పృశ్యత, అసమానతలను రూపుమాపడానికి 19దశకంలో తన రచనల ద్వారా గుర్రం. జాషువా విశేష కృషి చేశారని వారి చరిత్ర భావితరాలకు అందించాలని గుర్రం. జాషువా సాహితీ సదస్సు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ అతిధులుగా రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.

సాహితీ పోషకులుగా నిరంజన్ రెడ్డి

సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవుల చరిత్రలను నిత్యం వెలుగులోకి తీసుకువస్తున్న నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు సాహితీ కళా పోషకులుగా నిలిచిపోతారని కొనియాడారు. గతములో కవి సమ్మేళనాలు, సి.నారాయణ రెడ్డి జయంతి, సురవరం .ప్రతాప రెడ్డి సాహితీ సదస్సు మరియు ఔత్సాహిక కవులను ప్రోత్సహించడంలో నిరంజన్ రెడ్డి కృషి మరువలేనిదని వారు కొనియాడారు. ఈ సమావేశములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, కురుమూర్తి యాదవ్, ఉంగ్లం తిరుమల్, ఎద్దుల సాయి కుమార్, పెద్దింటి వెంకటేష్, నాగన్న యాదవ్, సర్పంచ్ శాంతయ్య,వెంకటయ్య, నీలస్వామి, బొబ్బిలి ప్రేమ్ కుమార్, సూర్యవంశం గిరి, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, వేణు, బాబు నాయక్, కుమార్, సి శంకర్, కుమ్మరి సత్యం ఉన్నారు.