ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి నూతన రధసారధి పి వి మోహన్

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త రథసారథి పి.వి. మోహన్! ​తమ ఓటు బ్యాంకు కోసమా? జగన్‌తో సమన్వయం కోసమా? ​ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రాజకీయ సమీకరణాలను తిరగరాసేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఢిల్లీ పీఠం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేసిన నూతన సంస్థాగత ఉత్తర్వులు ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. తమిళనాడు బాధ్యతలకు మాణికం ఠాకూర్‌ను పంపి, ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పీఠంపై సీనియర్ వ్యూహకర్త, కర్ణాటకకు చెందిన పి.వి. మోహన్‌ను అధిష్ఠానం నియమించింది....