ఆగస్టు 1 నుంచి 9 వరకు ‘నవోత్సవాలు’ నిర్వహించాలి: ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్, జూలై 31: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1 నుంచి 9 వరకు ప్రతి ఆదివాసీ గూడెంలో 'నవోత్సవాలు' ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... ఆదివాసుల రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం, హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం...