పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జూలూరుపాడు ప్రతినిధి ఆటో. క్యాబ్. స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలనుi ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. ఆగస్టు 24, 2026 నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు జూలూరుపాడు ఆటో యూనియన్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు మోటపోతుల ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈ-ఆటోలను అప్పగించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, ఆటో–రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను పెంచాలని కోరారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా, ఆయా యాప్‌ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాల సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆనంద్ విజ్ఞప్తి చేశారు. జే ఏ సి పిలుపు మేరకు ఆగస్టు 24 చేపట్టనున్న నిరవధిక బంద్‌కు ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ యూ సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు, పోతురాజు మురళీకృష్ణ, రంజిత్, రవీందర్, సాయి, మధు కొండ సత్యనారాయణ శివ (అలియాస్ అశోక్) బబులాల్ తదితరులు పాల్గొన్నారు.