అనంతసాగరం మండలాల్లో రేషన్ షాపులు, పాఠశాలలు, హాస్టళ్ల తనిఖీ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ జులై 06 2026: రిపోర్టర్ శ్రీహరి మర్రిపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్,అనంతసాగరం మండలంలోని సోమశిల గిరిజన గురుకుల పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ స్కూల్) లను సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అలాగే మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని కూడా పరిశీలించారు.రేషన్ షాపులో లబ్ధిదారులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా, కొలతల్లో ఎలాంటి తేడాలు ఉన్నాయా అనే విషయాలను వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.
పంపిణీ విధానం పారదర్శకంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం డిసిపల్లి మెయిన్ మరియు అంగన్వాడి, సోమశిల గిరిజన గురుకుల పాఠశాల, జడ్పీహెచ్ స్కూల్‌లలో మధ్యాహ్న భోజన పథకం అమలు, వంటగది నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లకు సూచించారు.బాలుర, బాలికల హాస్టళ్లలో విద్యార్థులతో మాట్లాడిన చైర్మన్, గుడ్లు, చికెన్‌తో పాటు వారానికి నిర్ణయించిన మెనూ ప్రకారమే భోజనం అందుతున్నట్లు విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా స్థాయి అధికారులు, మండల శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.