POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:55 pm Posted by : POLITICAL POWER

ఆత్మీయతకు… ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్

బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్ కు రాఖీ కట్టిన సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: పెబ్బేరు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగోని వెంకటన్న గౌడ్ కు స్థానిక సుభాష్ చౌరస్తాలో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంద అక్కమ్మ మాట్లాడుతూ… రక్షాబంధన్ పండుగ ఆత్మీయతకు, ఆప్యాయతకు, అన్నా–చెల్లెలు, అక్కా–తమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం ద్వారా సోదరభావం, పరస్పర ప్రేమ, ఆప్యాయతలను మరింత బలోపేతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మానవ సంబంధాలను, కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, సమాజంలో ప్రేమ, ఆప్యాయత, ఐక్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.