ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా
జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట / పొలిటికల్ పవర్, సెప్టెంబర్16:దగాపడ్డ నేల విముక్తి కోసం, వెట్టిచాకిరీ సంకెళ్లు తెంచేందుకు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ విప్లవ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. నిజాం నవాబుల నిరంకుశత్వం, దేశ్‌ముఖ్‌ల అణచివేత, రజాకార్ల నెత్తుటి దాహానికి వ్యతిరేకంగా పల్లెపల్లెనా జనం ఆయుధాలు చేతబట్టి గర్జించారు. ప్రముఖుల పోరాటాలే కాక, మారుమూల గిరిజన గూడేల నుంచి ప్రాణాలర్పించిన పోరాట యోధుల త్యాగాలు...