ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా
పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను పరిరక్షించడంతో పాటు ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 5న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ముట్టడి, మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పాల్వంచ పట్టణంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థవంతంగా అమలు...