పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో అకాల మరణాలతో విషాదంలో ఉన్న రెండు కుటుంబాలకు గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ చేయూతనందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అకాల మరణంతో కన్నుమూసిన గొల్ల సాయన్న యాదవ్ మరియు ఎం. బాలకిష్టయ్య కుటుంబాలను సర్పంచ్ గురువారం రోజు పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా సకాలంలో ఆదుకుంటానని, బాధిత కుటుంబాలకు గ్రామ పంచాయతీ తరఫున అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా గొంది రామకృష్ణారెడ్డి, ఎం. బుచ్చన్న, ఎస్. వెంకటయ్య, జి. బాలరాజు, కావలి ఉషన్న, ఎం. కురుమన్న, ఎం. రాములు, మందడి శ్రీను, ఎం. రామస్వామి, ఎం. శ్రీకాంత్ రెడ్డి, బోడి గణేష్, ఎం. రామాంజనేయులు, ఎం. సాయికుమార్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, అవసర సమయంలో అండగా నిలుస్తున్న సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ సేవలను గ్రామస్థులు అభినందించారు.