ఆపదలో ‘ఆదిపరాశక్తి’లా నిలిచిన సర్పంచ్: ఉగ్రరూపం దాల్చిన వాగును దాటించి గర్భిణికి పునర్జన్మ!
పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / NVR9 TV న్యూస్) అశ్వారావుపేట నియోజకవర్గం | ములకలపల్లి బ్యూరో స్పెషల్ రిపోర్ట్: ఆర్.సి. కారం వెంకటేష్ (నవంబర్ 5) ములకలపల్లి (పొలిటికల్ పవర్ ప్రతినిధి): "నాయకత్వం అంటే కేవలం అధికార పీఠం ఎక్కడం కాదు... కష్టం వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి ప్రజల ముందు నిలబడడం!" అని మూకమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మరోసారి నిరూపించారు. వర్షాల ధాటికి వాగు ఉప్పొంగి, వంతెన కూలిపోయి, ఓ వైపు మృత్యువు పంజా విసురుతున్న వేళ......