ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!
దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపు పొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడిన దమ్మపేటకు చెందిన ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రమాద సమయంలో ధైర్యసాహసాలతో పాటు సమయస్ఫూర్తిని ప్రదర్శించి బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన విశేష కృషిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్...