ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం – సీఎం రేవంత్ రెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ హైదరాబాద్, జూలై 30 2026: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి నేతృత్వంలోని నిపుణుల...