ఆరు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – సీరియల్ నిందితుడు అరెస్ట్* – 58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం

  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 04: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: తాళంవేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సీరియల్ నిందితుడిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి, రావులపాలెం, కోరుకొండ, ఆలమూరు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల...