POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 10:05 pm Posted by : POLITICAL POWER

ఆర్మూర్‌లో బీఎల్‌ఏల సమావేశం – కాంగ్రెస్ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 8 2026: ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏ) సమావేశానికి ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఐఎఫ్‌హెచ్‌డబ్ల్యూ చైర్‌పర్సన్ కవితా రెడ్డి సీలం, ఏఐపీసీ ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర విభాగం అధ్యక్షులు శశాంక్ పసుపులేటి, జీఐజీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షకీర్ బేగ్, ఆర్మూర్ టౌన్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, లైబ్రరీ చైర్మన్ చంద్ర మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు మరియు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ బీఎల్‌ఏ ఏజెంట్లు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్వహణ, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు.