పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 9 2026: పెద్దమందడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనము 18000 ఇవ్వాలని ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గిరిజ డిమాండ్ చేశారు బుధవారం నాడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం నాడు హైదరాబాదులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కి వెళ్తున్న ఆశలను ప్రభుత్వం పోలీసులచే అడ్డుకోవడం ఉదయం పోలీస్ స్టేషన్లో ఉంచడం మరి దారుణమని ఆమె చెప్పారు ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటిన ఆశలకు పైసా కూడా వేతనము పెంచలేదని ఆమె విమర్శించారు సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ ప్రసంగించారు టిఆర్ఎస్ నాయకులు సురేష్ , మద్దతు తెలిపారు కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు లక్ష్మి మహేశ్వరి పద్మ కళావతి ఉమాదేవి పోచమ్మ భారతి రాధా మన్నెమ్మ శంకరమ్మ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.