ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి * ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేత * డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమని వెల్లడి
గార్ల / ఇల్లందు (పొలిటికల్ పవర్ ప్రతినిధి, మాలోత్ అజయ్ నాయక్): గత 20 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గార్ల మండల నాయకులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. డిసెంబర్ 15 నుంచి సమ్మె సైరన్: ఈ సందర్భంగా యూనియన్ మండల...