ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అంబా సత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కుంకుమార్చన ఘనంగా
ఎన్విఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. భద్రాచలం] [29.07.2026]: ఆషాడ మాసం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబా సత్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం భక్తి శోభతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో 1008 సార్లు అమ్మవారికి కుంకుమార్చన చేశారు....