POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:03 pm Posted by : POLITICAL POWER

ఇంటర్ ప్రతిభా పురస్కారం అందుకున్న ఎంజేపీ విద్యార్థి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: తెలంగాణ ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని ఎంజేపీ సొసైటీ నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రతిభా పురస్కారాల్లో వనపర్తి జిల్లా విద్యార్థి ప్రతిభ కనబర్చాడు.

ఎంజేపీ జూనియర్ కాలేజీ చిట్యాల కడుకుంట్లకు చెందిన బిపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జె. విలాస్ ఇంటర్ పరీక్షల్లో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ సెక్రటరీ చేతుల మీదుగా విద్యార్థికి ప్రతిభా పురస్కారం, రూ.10,000 నగదు బహుమతి, మూమెంటో మరియు శాలువాతో సన్మానించారు. విద్యార్థి సాధించిన ఈ ఘనతపై ఆర్‌సీవో శ్రీనివాస్ గౌడ్, డీసీఓ శ్రీవేణి ప్రిన్సిపాల్ గురువయ్య గౌడ్ మరియు కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.