POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:56 pm Posted by : POLITICAL POWER

ఇంధన పొదుపుకు ఎమ్మెల్యే నల్లమిల్లి వినూత్న ఆలోచన

 

 

ఎలక్ట్రిక్ బైక్‌పై కొమరిపాలెంలో అభివృద్ధి పనుల పరిశీలన

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 15:

తూర్పు గోదావరిజిల్లా అనపర్తి:ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి వినూత్నంగా ముందుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ “నో వెహికల్ డే” సందర్భంగా కాన్వాయ్‌ను వదిలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌పై కొమరిపాలెం గ్రామానికి వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ఇంధన వనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలిని అలానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు కాలుష్య నియంత్రణ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలందరూ ఇంధన పొదుపును దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కొమరిపాలెం గ్రామంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నల్లమిల్లిని అనుసరిస్తూ బైక్‌లపై కొమరిపాలెం గ్రామానికి చేరుకుని ఇంధన పొదుపుపై ప్రజలకు సందేశం ఇచ్చారు.